నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బంగ్లాదేశ్లో అలజడులు పతాకస్థాయికి చేరాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణల్లో కనీసం 100 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాజా పరిణామాల మధ్య మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని, నిరవధిక కాలం దేశవ్యాప్త కర్ఫ్యూను అమలు చేయడం అధికారులకు తప్పలేదు.