ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారికి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పాపను అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికను గుర్తించిన కుటుంబ సభ్యులు నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.