రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన భార్య పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ బాధితులతో 20న సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు.