యాడికి మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఆదివారం స్థానిక టీడీపీ నాయకులు, లియోక్లబ్ సభ్యులు శ్రమదానం చేసి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఆస్పత్రిలో పాములు, విష పురుగుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే చెత్తాచెదారాన్ని, పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశామని అన్నారు. త్వరలో ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, ఎస్సీ సెల్ నాయకుడు లక్ష్మణ్, లియోక్లబ్ విశ్వనాథ్, రహంతుల్లా, చాంద్‌బాషా, వెంకటస్వామి, కృష్ణమూర్తి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.