పాణ్యం మండలంలోని కొత్తూరు దేవస్థానంలో కర్నూలు జిల్లా దేవదాయ ఉప కమిషనర్ గురుప్రసాద్ పూజలు నిర్వహించారు. ఆదివారం ఆయనకు ఆలయ ఈవో రామకృష్ణ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది ఉప పకమిషనర్‌ను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో నందవరం ఏసీ కామేశ్వరి, అర్చకులు వీరయ్య, సురేష్, నారాయణ, ఆలయ సిబ్బంది, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa