రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వైకోమ్ నిధియా దేవికి వినతిపత్రం అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమెను సోమవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక పడ్డారని అన్నారు.