చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామం లో మాజీ మంత్రి, రాప్తాడు నియోజకవర్గ శాసనసభ సభ్యులు పరిటాల సునీత మరియు టీడీపీ సీనియర్ నాయకులు ఎల్. నారాయణ చౌదరి ఆదేశాల మేరకు ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం ను మంగళవారం డీలర్ బండ్ల కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి పి డబుల్యో అధ్యక్షులు చండ్రాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు బండ్ల రాము, బండ్ల వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మురళీమోహన్, చిట్రా హరి పాల్గొన్నారు.