కౌతలం మండలంలోని ఉరుకుందలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామిని మాజీ ఎంపీ బుట్టారేణుక శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెను ఆశీర్వదించి ఆలయ జ్ఞాపికను, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తనయుడు బుట్టా ప్రతుల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa