ఏపీలో అన్న క్యాంటీన్ల ను తిరిగి పెద్ద సంఖ్యలో ప్రారంభిస్తున్నామని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.ఈనెల 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 33 మున్సిపాలిటీల్లో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు