గుడివాడ ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. బుధవారం ఆటోనగర్ సమస్యలపై కార్మికులు ఎమ్మెల్యే రాముకు వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను విన్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తనను కలిసిన వారికి భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో అందరంగాలతో పాటుగా చిన్న తరహా పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు.