జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14వ తేదీన అద్దంకిలోని కోర్టు భవనాల సముదాయం నందు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని కొరిశపాడు పోలీసుస్టేషన్ ఎస్సై శివయ్య బుధవారం తెలియజేశారు. ఆయా కేసులలో రాజీ పడదగిన కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించుకోవాలని తెలియజేశారు.