ఎం ఎస్ స్వామినాథన్ 1961-72 మధ్య కాలంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1972-79 మధ్యకాలంలో ICAR డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు.1979-80లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1980-82 మధ్యకాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగా, డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు.1982-88 మధ్యకాలంలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు.