ఆముదాలవలస మండలంలో తోటాడ పంచాయతీలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు పి సత్యనారాయణ పై వచ్చిన ఆరోపణలపై బుధవారం విచారణ చేపట్టారు. మండలంలో ఉపాధి హామీ పనుల్లో ఆరోపణ రుజువైతే చట్టపరమైన చర్యలు చేపడతామని ఉపాధిహామీ ఏపిడి కే లోకేష్ అన్నారు. క్షేత్ర సహాయకుడు బినామీ పేర్లతో కొందరికి మస్తర్లువేసి నిజమైన లబ్ధిదారులకు నష్టపరిచారని, ఉపాధి హామీనిధులు దోచుకున్నారని గ్రామానికి చెందిన తాండ్ర రంగారావుతో పాటు ఫిర్యాదు చేశారు.