అర్హులందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం సత్య సాయి జిల్లా కలెక్టర్ టి. ఎస్ చేతన్ పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులతో పనిచేసే వెనుక బడిన వర్గాల కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించే పని చేసే కళాకారుల కుటుంబం బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు.