ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు.