టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అధ్యక్షతన గురువారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతుందని.. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో టిడిపి పార్డీని బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. టీడీపీ పార్టీ సభ్యత్వం రుసుము రూ.100 తో ప్రారంభిస్తామని.. సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఉండాలని నిర్ణయించారు. అలాగే పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందిస్తామని సమావేశంలో నిర్ణయించారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటామని సమావేశంలో చర్చించారు. సరిగా దృష్టి పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేదని టీడీపీ బ్యూరోలో నేతలు చర్చించారు.