ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరులకు శుభాకాంక్షలు. గిరిజనుల సంక్షేమం కోసం గతంలో గిరి గోరుముద్దలు, పోషకాహార బుట్టలు, ఫీడర్ అంబులెన్సులు, డయాలసిస్ కేంద్రాలు, 50 ఏళ్లకే పింఛన్లు వంటి ఎన్నో పథకాలను అమలుచేసింది తెలుగుదేశం. గిరిజన ప్రగతి కోసం పోడు భూములపై హక్కులు కల్పించింది. గిరిజన విశ్వవిద్యాలయం కోసం కృషి చేసింది. యువకుల ఉపాధి కోసం ఇన్నోవా కార్లు ఇచ్చింది. గిరి నెట్ సేవాకేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏజెన్సీలోని ఉద్యోగాలు స్థానికులకే చెందేలా జిఓ నెంబర్ 3ని తెచ్చింది.