ఏపీలో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినవాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్తగా వివాహమైనవారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు.