కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నాగాయలంకకు చెందిన పారిశ్రామికవేత్త, వితరణాశీలి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు కేరళ ముఖ్యమంత్రికి శుక్రవారం రూ. 25 లక్షల విరాళాన్ని అందించారు. గతంలో దివి ప్రాంతంలో పలు కార్యక్రమాలకు ఆయన సాయం అందచేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.