తిరుపతి డీఎస్పీగా వెంకటనారాయణ నియమితులయ్యారు.గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఐగా, డీఎస్పీగా వెంకటనారాయణ పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తిరుపతి ట్రాఫిక్‌లో పనిచేసాక ఇక్కడినుంచి గుంటూరు రూరల్‌కు బదిలీపై వెళ్లారు.శుక్రవారం వెంకటనారాయణ తిరుపతిలో బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే తిరుమల డీఎస్పీగా విజయశేఖర్ నియమితులయ్యారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొందిన ఈయన చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్, తిరుపతి ట్రాఫిక్, కర్నూలు డీఎస్పీగా పనిచేశారు. ఎన్నికల అనంతరం జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఆయన్ను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టారు. ఈయనతో పాటు తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్సు డీఎస్పీగా పనిచేస్తూ డెప్యుటేషన్‌పై తిరుపతి క్రైం డీఎస్పీగా ఏడాది పనిచేసిన రవికుమార్‌ను పుత్తూరు డీఎస్పీగా నియమించారు. తిరుపతి రెడ్ శ్యాండిల్ టాస్క్‌ఫోర్సు డీఎస్పీగా పనిచేస్తున్న చెంచుబాబును నాయుడుపేట డీఎస్పీగా నియమించారు.తిరుపతిలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా పనిచేస్తున్న వెంకటాద్రిని రేణిగుంట డీఎస్పీగా నియమించారు.రేణిగుంట డీఎస్పీగా పనిచేస్తున్న భవ్యకిషోర్‌ను రాజమండ్రి సౌత్ జోన్ డీసీపీగా నియమించారు. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్న సోమన్నను ఆదోని డీఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. పుత్తూరులో డీఎస్పీగా పనిచేస్తున్న ఎంపర్ల శ్రీనివాసరావు సీఐడీ డీఎస్పీగా నియమితులయ్యారు.