విజయనగరం పరిధిలో భామిని గ్రామంలో గురువారం జరిగిన దాడి ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భామిని గ్రామానికి చెందిన జి.సురేష్ అనే రైతు గురువారం తన పొలంలో మొక్కలు నాటుతున్నాడు. ఇంతలో సరిహద్దు పొలానికి చెందిన కొందరు యాదవులు అక్కడికి వచ్చి, తమ పొలానికి ఆనుకుని ఎందుకు మొక్కలు నాటుతున్నా వని దాడికి దిగారు. ఈ విషయాన్ని సురేష్ తమ బంధువులకు సమాచారం అందించారు. సురేష్ బంధువులు అక్కడకు వస్తున్నారని తెలుసుకున్న యాదవులు లివిరి గ్రామ సమీపంలో అడ్డగాసి, కర్రలు, కత్తులతో దాడికి దిగారు. దీంతో జి.లక్ష్మీపతి, జి.రాజు, భూపతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని భామిని పీహెచ్‌సికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సీతం పేట ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రసాద్ గాయపడిన ముగ్గురు వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నా రు. లివిరి గ్రామానికి చెందిన ఆరుగురు యాదవులపై కేసు నమోదు చేశారు.