కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో వర్షాల కోసం ఏడు గ్రామాల్లో భజన కార్యక్రమాన్ని శనివారం భజన కళాకారులు చేపట్టారు. మొదటగా బోరంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంవద్ద భజన ప్రారంభించారు. ఈ సందర్భంగా భజన కళాకారులు మాట్లాడుతూ వర్షాలకోసం ఏడు గ్రామాల్లో భజనచేస్తామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. భజన చేస్తే వర్షాలు కురుస్తాయని వారు నమ్ముతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa