చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ శ్రావణ శనివారం సందర్భంగా తిరునామాల అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయాన్ని మామిడి, వేపాకు, పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ఆలయం లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.