ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ విబేధాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తనను అనవసరంగా మధ్యలోకి లాగుతున్నారని దివ్వల మాధురి కూడా తీవ్రంగా స్పందించారు. ఇందులో ఎవరి వాదన సరైనదో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా స్పందించారు.తన కొడుకు దువ్వాడ శ్రీనివాస్‌ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని లీలావతి ఆరోపించారు. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్ కట్టించాడని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వాణికి చెందదని అన్నారు.ప్రతి రోజు ఏదో ఓ గొడవ జరిగేదని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసేదని బయటపెట్టారు. ఆమె టార్చర్ పడలేక గతంలో తన కారులో మూడు రోజులు పడుకున్నానని బయటపెట్టారు. తండ్రిగా తన కూతుళ్లకు అంతా మంచే చేశానని స్పష్టం చేశారు. మాధురి అనే మహిళ తనను ట్రాప్ చేయడానికి తానేం చిన్న పిల్లాడిని కాదని అన్నారు.దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.