రఘురామకృష్ణరాజు పై కస్టోడియల్ టార్చర్ విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు.కక్షతో అరెస్టు చేశామన్న అభిప్రాయం రాకుండా వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఖర్చు చేసేసుకున్న తర్వాతనే లోపలికి పంపాలని డిసైడయ్యారు.సీఐడీ డీఎస్పీ గా పని చేసిన విజయ్ పాల్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.రిటైరైపోయిన ఆయనను ఓఎస్డీగా నియమించిన జగన్ ప్రభుత్వం.ప్రభుత్వం పై ప్రెస్ మీట్లు పెడుతున్నారన్న కారణంగా దేశద్రోహం కేసు పెట్టించేసింది.ఈ విజయ్ పాలే సీఐడీ అధికారికాగా సమోటోగా కేసు నమోదు చేశారు.ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ రాలేదు,అంటే...ఆయన కేసు పెడితే అరెస్టు చేసుకొచ్చి చిత్రహింసలు పెట్టి చంపాలని చూసిన అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్,ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయు లకు కూడా ముందస్తు బెయిల్ లేనట్లే.ఇప్పటికే ఈ కేసులో రఘురామ సాక్ష్యాలను రెడీ చేసి పెట్టుకున్నారు.తనను టార్చర్ చేయకపోతే ఆయన ఈ కేసుపై ఇంత గా పట్టుబట్టి ఉండేవారు కాదు.తనను కొట్టింది నిజం కాబట్టి ఆయన చట్టపరం గానే ఆయా అధికారులపై ముందుకెళ్తున్నారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ క్రిమినల్ మైండ్ ఉన్న పాలకుడ్ని సంతృప్తి పరచడానికి వీరు చేసిన చర్యల కారణంగా ఇప్పుడు వారు జైళ్లకు వెళ్లబోతున్నారు...