గుంటూరు జిల్లా పెదకాకాని ఎస్ఐగా టి. పి. నారాయణస్వామి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ నారాయణస్వామి విఆర్ నుంచి పెదకాకాని బదిలీపై వచ్చినట్లు మీడియాకు తెలిపారు. స్టేషన్ పరిధిలోని ఎటువంటి గొడవలు, గంజాయి, పేకాట అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది సహకారంతో అణిచివేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ నారాయణస్వామిని స్టేషన్ సిబ్బంది స్వాగతం పనికి పుష్పగుచ్చాలు అందించారు.