కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో 150 సంవత్సరాలు మర్రిచెట్టు మహా వృక్షంలా నీడని ఇస్తూ తమకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని గ్రామంలోని పలువురు ప్రజలు ఆదివారం తెలియజేశారు. ఎండకి, వానకి ఈ మహా వృక్షం తమకు ఎంతగానో ఆసరాగా మారిందని వారు తెలిపారు. 150 సంవత్సరాల నుంచి ఈ వృక్షం ఇప్పటి తరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం తామంతా సేద తీరుతామని చెప్పారు.