యువతకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజపతినగరంలోని మెంటాడరోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లిఖార్జున జెమార్టను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసిపిప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. దుకాణం యజమాని మజ్జి మహేష్, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పాల్గొన్నారు.