విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ఫిబ్రవరి 11న చేపట్టనున్న దీక్షకు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. మరుసటి రోజు 12న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివరిద్దామని చెప్పారు. కొద్దిసేపటి క్రితం టీడీఎల్పీ సమావేశం ముగిసింది. శుక్రవారం నల్ల చొక్కాలతో సభకు హాజరుకావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పునర్విభజన చట్టం అమలుపై రేపు సభలో చర్చిస్తామని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల ప్రచారం అంశాలు చంద్రబాబు సమావేశంలో చర్చించారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తికావాలని, పేర్లు సిద్ధం చేయాలని కోరారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 30రోజుల పాటు ప్రచారం ఉండేలా కార్యాచరణ ఉండాలన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.