జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వస్తున్న ఆరోపణలుపై టీడీపీ ఎదురు దాడి ప్రారంభించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధావెంకన్న స్పందిస్తూ కాపీ కొట్టాల్సిన ఖర్మ చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని పేర్కొన్నారు. ఇతరులకు చంద్రబాబు ఆదర్శంగా ఉంటారు తప్పితే..ఎవరో ప్రకటించిన పథకాలను కాపీ కొట్టాల్సిన అసవసం తమకు లేదన్నారు. ప్రజలు ఏం చేస్తే మేలు జరుగుతుందనే కోణంలో ఆలోచించి చంద్రబాబు పథకాలు ప్రకటిస్తున్నారు బుధ్దా వెంకన్న సమర్ధించారు.
ఈ సందర్భంగా బుద్ధావెంకన్న మాట్లాడుతూ వాస్తవానికి జగన్ ని కాపీ కొట్టడమంటే ఆయనలా లక్ష కోట్లు దోచుకోవడం... ఆయనలా జైల్లో ఉండొస్తే కాపీ కొట్టారనొచ్చంటూ బుద్ధవెంకన్న సెటైర్లు విసిరారు. వాస్తవంగా చెపన్పాలంటే జగన్ 'నవరత్నాలు' అంటే ... బెదిరించడం, బాధించడం, వేధించడం, దోచుకోవడం, దాచుకోవడం, పారిపోవడం, వంచించడం, మాటమార్చడం, చేతులెల్తేయడం అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు సంధించారు.