వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్ కొట్టుకుపోతే, దానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని బాధ్యులను చేస్తూ, ఎల్లో మీడియా నానా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. తుంగభద్ర డ్యామ్ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని వెల్లడించారు. అలాంటప్పుడు డ్యామ్‌లో భారీ వరదకు ఒక గేట్ కొట్టుకుపోతే, దానికి గత ప్రభుత్వం, వైయస్ జగన్ ఎలా బాధ్యులవుతారని నిలదీశారు.