మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిపై 427 కుటుంబాలు సోమవారం మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాయి. బాలినేనికి ఓట్లు వేయలేదన్న కక్షతో వారికి చెందాల్సిన భూములను వేరే వాళ్లకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వినతులను స్వీకరించిన మంత్రి ఆనం రాం నారయణ రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు.