సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న "సపోర్టు ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ " పథకం ద్వారా అట్టడుగు వర్గాల వారైన యాచకులకు మద్దతు తెలపాలని, ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు. యాచక వృత్తిలో నిమగ్నమైన వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం అధికారులు కృషి చేయాలని సూచించారు.