కలకత్తాలోని ఆర్జీకేఏఆర్ మెడికల్ కాలేజీ సెకండియర్ పీజీ విద్యార్థిని హత్యను నిరసిస్తూ సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో కర్నూలులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీకి జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీ శ్యామల, అసోసియేట్ ప్రొఫెసర్ జే.జయరాం సంఘీభావం ప్రకటించారు. జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అచ్యుత, వైస్ ప్రెసిడెంటు పవన కళ్యాణ్, భరత, శిరీషలు మాట్లాడారు. కలకత్తాలో మెడికల్ కాలేజీ విద్యార్థిని హత్యను నిర సిస్తూ మంగళవారం నుంచి ఆసుపత్రిలో ఓపీ, ఎలక్ర్టివ్ సేవలు నిలిపివేస్తు న్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అచ్యుత తెలిపారు.