మదనపల్లె పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలను స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానబాషా ఆదేశించారు. సోమవారం ఉదయం వర్షపు నీరు నిలచిన పలు ప్రాంతాలను కమిషనర్ ప్రమీల తో కలిసి ఎమ్మెల్యే షాజహానబాషా పరి శీలించారు. పట్టణంలో పలు చోట్ల మురుగు. వర్షపు నీరు రోడ్లపై పారుతుందంటూ స్థానికులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన కదిరి రోడ్డులోని శ్రీకృష్ణ కల్యాణ మండపం వద్ద నిలచిన మురుగు తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రెడ్డీస్ కాలనీ, ప్రశాంతనగర్, ఆర్టీసీ బస్టాండ్, జడ్పీ స్కూల్ ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలతోపాటు టీడీపీ కౌన్సిలర్ తులసీ రామకృష్ణ, షంషీర్, మార్పురి నాగార్జునబాబు(గాంధీ), జేసీబీ వేణు, మధు, బిల్డర్ రామకృష్ణ, నీళ్ల భాస్కర, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులునాయుడు, యర్రబల్లి వెంకటరమణారెడ్డి మార్పురి శశిధర్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.