జాతీయస్థాయి యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మెరిసింది. గతంతో పోల్చుకుంటే తన సత్తాను మెరుగుపరచుకొని జాతీయ ర్యాంకుల్లో టాప్ 100లో నిలవడం గమనార్హం. దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్-2024) ర్యాంకులు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఓవరాల్ యూనివర్సిటీ కేటగిరీలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 97వ స్థానాన్ని కైవశం చేసుకుంది. అలాగే యూనివర్సిటీల కేటగిరీలో 59వ ర్యాంకు, ేస్టట్ యూనివర్సిటీ కేటగిరీలో 20 ర్యాంకు, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలల విభాగంలో 63వ ర్యాంకును పదిలపరుచుకుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, ఇన్‌ఛార్జి రెక్టార్ ప్రొఫెసర్ కె. రత్నషీలామణి, ఇన్‌ఛార్జి రిజిస్ర్టార్ ప్రొఫెసర్ జి.సింహాచలం హర్షం వ్యక్తం చేశారని ర్యాంకింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. రవి తెలిపారు.