బీజేపీ ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నేటి స్వాతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితమన్నారు. ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు. దేశమంతా విద్యార్ధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతి యావత్తు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా దేశమంతా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఆవిష్కరించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తిరంగా యాత్ర గురించి వివరించామన్నారు. జాతీయ జెండా చేత బూని తిరంగా యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పురందేశ్వరి వెల్లడించారు.