అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్‌ను మార్చారన్నారు. పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని చెప్పారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతోందని, నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 87 సర్వే నెంబరులో ఎలాంటి సబ్‌డివిజన్‌లు జరగలేదన్నారు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామన్నారు.