రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి. మేం సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు. నీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు అన్నీ ఎదుర్కొంటాం. మీకు చేతనైంది చేసుకోండి. మిమ్మల్ని నిలదీయకుండా వదలం. మేం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.