ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ తప్పూ చేయకపోయినా, జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇలా వేధిస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 01:14 PM

రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. అందుకే ఇదంతా అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ఒక బీసీ అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. అక్రమ కేసులతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే ఇదంతా జరుగుతోంది. ఏ తప్పూ చేయకపోయినా, జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇలా వేధిస్తారా?. మేం పరామర్శించడానికి రావొద్దా? అది తప్పా?. జోగి రమేష్‌ గారి గొంతు నొక్కాలని వారి కుటుంబాన్ని టార్గెట్‌ చేయడం ఎంతవరకు సమంజసం?. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి బెదిరింపులకు ఆయన (జోగి రమేష్‌) భయపడరు, రమేష్‌ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com