పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2,500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆస్పత్రుల రోజు వారీ ఖర్చులకు డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం.’ అని పేర్కొంది.