ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. టికెట్ కౌంటర్ల వద్ద QR కోడ్ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బుధవారం వెల్లడించింది. UPI యాప్స్‌తో పేమెంట్స్ చేయొచ్చని, పేమెంట్ పూర్తి కాగానే కౌంటర్ వద్ద టికెట్ అందిస్తారని పేర్కొంది. తొలుత దీనిని ప్రధాన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు తెలిపింది.