• విశాఖలో IT పార్కు అభివృద్ధి నిమిత్తం భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో 76.88 ఎకరాల భూమిని APIIC విశాఖపట్నం జోనల్ మేనేజర్‌కు ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
గుంటూరులో టెక్స్‌టైల్ పార్క్‌కు భూములు :
• గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామ శివారు గోపాలంవారిపాలెంలో గుంటూరు టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు కోసం మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.18,15,000 చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
కర్నూలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసుకు స్థలం కేటాయింపు :
• కర్నూలు జిల్లా దీన్నెదేవరపాడు గ్రామంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయ భవన నిర్మాణం, క్వార్టర్స్ నిర్మాణం కోసం ఎకరం భూమిని రూ.1,25,30,063 ధరకు అందివ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థకు కేటాయింపు:
• కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో 2467.28 ఎకరాల భూమిని 2750 మెగావాట్స్ సామర్ధ్యంతో నిర్మితమయ్యే ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థకు ఎకరా రూ.2,50,000ల మార్కెట్ విలువకు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.