శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 21న జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 39 మంది నిలిచారు. వారిలో ముగ్గురు మైనారిటీ తమిళులు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉన్నారని శ్రీలంక ఎన్నికల సంఘం తెలిపింది. అధ్యక్ష ఎన్నికల నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియడంతో 39 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ 39 మందిలో ఒక్క మహిళ కూడా లేదని పేర్కొంది.