విజయవాడ ఏలూరు రోడ్డు సీతారామపురం కాకతీయ డిగ్రీ కాలేజీలో ఫిబ్రవరి 2న(శనివారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అడ్వాంటేజ్ ఏపీ కెరీర్ ఎక్స్‌పో పేరుతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఇంటర్య్వూలు జరుగుతాయి. ఈ కెరీర్ ఎక్స్‌పోలో ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన అభ్యర్థులకు అపోలో ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, మెడ్ ప్లస్, పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వబడతాయని ప్రణయ్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.10 వేలు నుంచి నుంచి రూ.16 వేల వరకు ఉంటుంది. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు 9502757755, 8919951682 నంబర్లలో సంప్రదించాలని ప్రణయ్ తెలిపారు