రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ఇచ్చారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా అంటూ జగన్ను ఉద్దేశిస్తూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు. "నీలా నాకు క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్లాను. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి నీకు కొంత టైమ్ పడుతుంది. సరే కానీ బాబాయ్(వివేకా)ను హత్య చేసింది ఎవరో చెప్పే దమ్ము నీకు ఉందా జగన్" అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.