రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందిందన్నారు. సంక్షోభం నుంచే అవకాశాలు వెతుక్కున్నామని.. అభివృద్ధికి బాటలు వేశామన్నారు. 2014-19 కాలంలో పోలవరం, రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చేవని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసక పాలన చేపట్టారన్నారు. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో దోపిడీ చేశారన్నారు.