బత్తలపల్లిలోని ఆర్డిటి ఆసుపత్రిలో ఓపి సేవలు శనివారం నిలిపివేస్తునట్లు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడినందుకు నిరసనగా బత్తలపల్లిలోని ఆసుపత్రి వైద్యులు నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు రావద్దని పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa