అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్, ఎన్డీపిఎస్, మిస్సింగ్ పలు ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసులపై జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణాని జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు.