ఒంటిమిట్ట శ్రీ రామ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ మరమ్మత్తు పనులకు గాను మంజూరైన 16 లక్షల రూపాయల మొత్తంతో వెంటనే పనులు ప్రారంభించాలని మాజీ రాష్ట్ర కలుగీత కార్పోరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన శనివారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశించిన మేరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. టెండర్లకు పిలిచే పనులు ప్రారంభించే లోపల ఒంటిమిట్ట మండలంలోని పసుపు, అరటి నష్టపోతారన్నారు.